Wednesday, May 28, 2008

అంతర్మధనం

చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్
లాహిరి నడిసంద్రములోనా లంగరుతో పని లేదోయ్

మధ్య రాత్రి దాటి చాలసేపయ్యింది
దాదాపు తెల్లారి మూడయ్యింది
కంటికి కునుకు మాత్రం రానంది
మెదడిక పని చెయ్యనంది
మనసు మాత్రం జాలి పడింది
చివరికి తోడుగా చిరుగాలి మాత్రం మిగిలింది
అంతకన్నా ఇలాంటప్పుడు ఇంకే తోడు దొరుకుతుంది

ఎలా ఉన్నావు అని అడిగింది చిరుగాలి
జవాబు కళ్ళలో ఉంది చుడమన్నాను
ఎం చేస్తున్నావు అని అడిగింది మళ్ళీ
ఆలోచిస్తున్నానని సమాధానమిచ్చాను
సమస్యకు పరిష్కారమా అని తన మరో ప్రశ్న
"పరిష్కారాన్ని వెదుకుతుండగా మరో సమస్య వస్తుందేమో అని" అన్నాను
ఇంతకన్నా ఇలాంటప్పుడు ఇంకే జవాబు దొరుకుతుంది

నీ రెండో సమస్య నీ కళ్ళలోనే ఉందంది చిరుగాలి
మొదటి సమస్య వల్లనే కదా కన్నీరు వచ్చిందీ అన్నాను
కన్నీరున్న చోటకి పరిష్కారం రాదుకదా మరి అని నవ్వింది
వెంటనే కళ్లు తుడుచుకుని చూసాను
మళ్లీ పరిష్కారాన్ని ఆలోచించడం మొదలుపెట్టాను
కన్నీటి అడ్డు పోగానే కంటికి నిదరొచ్చింది
కన్నీటికి వీడ్కోలు పరిష్కారానికి స్వాగతమే కదా అంది
కళ్ళకు విశ్రాంతి లేకపోతే పరిష్కారమైనా ఎలా కనిపిస్తుంది
పరిష్కారం దొరక్కుండా జీవితమైనా ఎలా సాగుతుంది
పనికొచ్చే ధైర్యం ఉంటే నిద్ర రాని రాత్రెందుకుంటుంది
ఆవలింతలకు కవితలతో అవసరమేముంటుంది
అందుకని అడ్డూ లేని మనసు హాయిగా నిదరోయింది
ఇంతకన్నా ఇలాంటప్పుడు సమస్య తీరే మార్గమేముంటుంది